Verse
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా…‖ నీ దయ ‖
Verse
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ‖ 2x ‖
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు‖ 2x ‖
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము – నీవె నా జీవము
నీవె నా గమ్యము – నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా‖ నీ దయ ‖
Verse
ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి‖ 2x ‖
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని‖ 2x ‖
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా – నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా‖ నీ దయ ‖