Verse 1
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం‖ 2x ‖
నీ దయ లేనిదే నేనేమౌదునో‖ 2x ‖
తెలియదయ్యా…‖ నీ దయలో ‖
తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా‖ 2x ‖
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని‖ నీ దయలో ‖
నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు‖ 2x ‖
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని‖ నీ దయలో ‖