Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Deerghashaanthame

నీ దీర్ఘశాంతమే

Nee Deerghashaanthame

Verse
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము‖ 2x ‖
యేసయ్యా… కనిపించరే
నీలాగా ప్రేమించే వారెవరు‖ 2x నీ దీర్ఘ ‖
Verse
కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను
వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను‖ 2x ‖
(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో
ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు‖ 2x ‖
యేసయ్యా… కనిపించరే
నీలాగా దీవించే వారెవరు‖ 2x నీ దీర్ఘ ‖
Verse
ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని‖ 2x ‖
తృణీకరింపబడిన నా బ్రతుకును
కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు‖ 2x ‖
యేసయ్యా… కనిపించరే
నీలాగా కృప చూపే వారెవరు‖ 2x నీ దీర్ఘ ‖
Verse
నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో
జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను‖ 2x ‖
మధురమైన నీ సహవాసముతో
నా జీవ నాథుడా నీ మమతను పంచావు‖ 2x ‖
యేసయ్యా… కనిపించరే
నీలాంటి జీవము గల దేవుడెవ్వరు‖ 2x నీ దీర్ఘ ‖

Related Tags

PraiseWorshipHope