Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Deerghashanthame Naa Hrudayaniki Dhairyamu

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము

Nee Deerghashanthame Naa Hrudayaniki Dhairyamu

Lyricist: Krupa Ministries, Guntur
Chorus
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
నీ కరుణ కటాక్షములే నా బతుకుకు ఆధారము
యేసయ్య కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు
Verse
కడుపేద స్థితిలోనే కరువే నా బందువాయెను
వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే క్రుంగ దీసెను
ఏ ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడా నాన్నాదుకున్నావు‖ ఏ ‖
యేసయ్య కనిపించరే నీలాగా దీవించే వారెవరు
Verse
ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని
తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణ సంపన్నుడా నన్నెన్నుకున్నావు
యేసయ్య కనిపించరే నీలాగా కృప చూపే వారెవరు
Verse
నా ప్రాణం నాలో క్రుంగి వున్న సమయములో
జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను
మధురమైన నీ సహవాసముతో నా జీవ నాథుడా నీ మమతను పంచావు
యేసయ్య కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు

Related Tags

PraiseWorshipGrace