Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Devudedamchu Nannaduguchunnaru

నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు

Nee Devudedamchu Nannaduguchunnaru

Verse
నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు
ఎక్కడున్నావని చెప్పనూ
ఎలా వున్నావని చూపను యేసు‖ 2x ‖
Verse
ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా
యేసురాజే స్రుస్టికర్తయని యేసు నాధుడే సార్వభౌముడని
అంతరిక్షము చెప్పలేదా ఆకాశముల నడుగరాదా
Verse
నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేదా
యేసురాజే దేవదేవుడని విశ్వమంత యేసు సృస్టియని
సాక్షులై అవి చెప్పలేదా నక్షత్రముల నడుగరాదా
Verse
మానవాత్మను అడుగరాదా అంతరాత్మే చెప్పలేదా
యేసు దేవుడే నిన్ను చేసేనని యేసు లేనిదే ఏది కలుగలేదని
అంతరాత్మే చెప్పలేదామానవాత్మను అడుగరాదా
Verse
దైవ వాక్యం చదువరాదా వాక్యసత్యం చెప్పలేదా
యేసు ప్రజల రక్షకుండని యేసే ప్రజల విమోచకుండని
వాక్యసత్యం చెప్పలేదాదైవ వాక్యం చదువరాదా

Related Tags

WorshipJesusCreation