Verse
నీ దేవుని సంధించ నీవు ఆయత్తమా
Verse
భువికి యేసు వచ్చునప్పుడు దుష్టులణిగెదరు
ఆ విధమున నీవుండిన ఏమి చేతువు?
Verse
మేఘముతో వత్తునని చెప్పినవాడు
మేఘముపై వచ్చుకాలము సమీపించెను
Verse
దూత గణములతో బూరధ్వనితో
ఆ భక్తగణముల గలియు కాలమాయెను
Verse
భక్తి హేనులెల్ల నపుడు అంగలార్తురు
రక్షణను పొందలేరు వారలప్పుడు
Verse
పాప జీవులెల్ల నాడు దాగుకొందురు
శుద్ధ పరచబడినవారు ఎగిరిపోదురు
Verse
కృపకాలమందే పశ్చాత్తాప మొందుము
ఇప్పుడే అంగీకరించి మన్నింపు నొందు
Verse
నీకై మృతి బొంది యేసు కాచియున్నాడు
నిన్ను అంగీకరించును కరుణతోడను
Verse
దేవుని అంగీకరించని వారు ఆ నాడు
దాగుకొని నిరతము పరితపింతురు