Verse
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా‖ నీ ధనము ‖
Verse
ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా‖ 2x ‖
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా‖ నీ ధనము ‖
Verse
పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా‖ 2x ‖
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా‖ నీ ధనము ‖
Verse
వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా‖ 2x ‖
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా‖ నీ ధనము ‖
Verse
కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు‖ 2x ‖
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా‖ నీ ధనము ‖