Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Dhanamu Nee Ghanamu Prabhu Yesude

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

Nee Dhanamu Nee Ghanamu Prabhu Yesude

Chorus
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమ భాగము నీయ వెనుదీతువా‖ నీ ధనము ‖
Verse
ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా‖ 2x ‖
పరలోక నాథుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా‖ నీ ధనము ‖
Verse
పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా‖ 2x ‖
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయనో క్రైస్తవా‖ నీ ధనము ‖
Verse
వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా‖ 2x ‖
వెలిగించ ధరపైని ప్రభు నామము
కలిమికొలది ప్రభున కర్పింపవా‖ నీ ధనము ‖
Verse
కలిగించె సకలంబు సమృద్ధిగా
తొలగించె పలు బాధభరితంబులు‖ 2x ‖
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా‖ నీ ధనము ‖

Related Tags

GratitudeOfferingStewardshipTithe