Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Dhevuni Sannidhini Kanabadanu Neevu Sidhdhapadumaa

నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా

Nee Dhevuni Sannidhini Kanabadanu Neevu Sidhdhapadumaa

Verse
నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా
Verse
నీ యౌవనములో నీ హృదయమును
సంతృప్తిగా నుండనిమ్ము
అయితే వీటిని బట్టి దేవుడు
తీర్పులోనికి తెచ్చు నిన్ను
Verse
దుర్దినంబులు రాకముందే
వాటిలో సంతోషము లేదని
చెప్పుసమయము రాకమునుపే
సృష్టికర్తను స్మరియించుమా
Verse
నీ యౌవన జీవితమును బట్టి
తృణీకారము నొందకుమా
ప్రభువును బోలి నడచుకొనుమా
మాదిరి కరముగా జీవించుమా
Verse
వినయ విధేయత కలిగి యుండి
ఒకరి నొకరు యోగ్యులుగా
మన్నన చేయుచు పరుల కార్యముల
స్వకార్యముల వలె భావించుమా
Verse
ప్రేమ సంతోష సమాధానము
దీర్ఘ శాంత దయాళుత్వము
మంచితనము సాత్వీక విశ్వాసము
కలిగి యుండి జీవించుమా
Verse
మేలు చేయుట యందు నీవు
విసుగక యుండుము యెల్లప్పుడు
సహనముతో ప్రభు సేవ చేసిన
ఫలము ననుభవించెదవు
Verse
హల్లెలూయా పాటలు పాడుచు
ఎల్లప్పుడు ప్రభు రాకడకై
ఉల్లమునందు సంతసించుచు
పాడుము ప్రభునకు హల్లె లూయా

Related Tags

WorshipYouthPreparation