Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Gnaapakam Anekulanu

నీ జ్ఞాపకం అనేకులను

Nee Gnaapakam Anekulanu

Lyricist: Kreesthu Das
Verse
నీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా
నీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా‖ 2x ‖
నీ జ్ఞాపకం నీవు మరణించినా
మరణాంతర పరిచర్య చేయునా‖ 2x ‖
మరణాంతర పరిచర్య చేయునా‖ నీ జ్ఞాపకం ‖
Verse
పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళం
పౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం‖ 2x ‖
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా‖ 2x నీ జ్ఞాపకం ‖
Verse
బర్నబాన్న జ్ఞాపకం – ఆదరణానందము
తిమోతన్న జ్ఞాపకం – విశ్వాస విజయము‖ 2x ‖
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా‖ 2x నీ జ్ఞాపకం ‖
Verse
ఫిలిప్పన్న జ్ఞాపకం – సువార్త సునాదము
స్తెఫనన్న జ్ఞాపకం – క్రీస్తుని స్వారూప్యము‖ 2x ‖
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా‖ 2x నీ జ్ఞాపకం ‖

Related Tags

ComfortRemembranceMinistry