Verse
నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని‖ 2x ‖
బలు రక్కసి వృక్షపు గాయములు‖ 2x ‖
ప్రేమా హస్తములతో తాకు ప్రభు‖ 2x నీ జల్దరు ‖
Verse
నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి‖ 2x ‖
నీ శిరము వానకు తడిచినను‖ 2x ‖
నను రక్షించుటకు వేచితివి‖ 2x నీ జల్దరు ‖
Verse
నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి‖ 2x ‖
ద్రాక్షా రస ధారల కన్న మరి‖ 2x ‖
నీ ప్రేమే ఎంతో అతి మధురం‖ 2x నీ జల్దరు ‖
Verse
ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా‖ 2x ‖
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి‖ 2x ‖
నీ సొగసును నాకు నొసగితివి‖ 2x నీ జల్దరు ‖