Verse
నీ జల్దరు వృక్షపు నీడలలో
నే నానంద భరితుడనైతిని
బలురక్కసి వృక్షపుగాయములు
ప్రేమాహస్తములతో తాకు ప్రభు
Verse
నా హృదయపు వాకిలి తియుమని
పలు దినములు మంచులో నిలిచితివి
నీ శిరము వానకు తడిసినను
నను రక్షించుటకు వేచితివి
Verse
ఓ ప్రియుడా నా అతిసుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి
Verse
నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షారస ధారలకన్న మరి
నీ ప్రేమే ఎంతో అతిమధురం
Verse
ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చు చున్నాడు
నా హృదయపు తలుపులు తెరచుకొని
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను
Verse
నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నా కందించి
పరమా గీతములను నేర్పితివి