Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Jeevitamulo Gamyambu Edo Okasari Yocha

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచ

Nee Jeevitamulo Gamyambu Edo Okasari Yocha

Verse
నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా?
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మర్పించవా?
Verse
నీ తల్లి గర్బమున నీ వుండినపుడే నిను చూచె ప్రభు కన్నులు‖ 2x ‖
యోచించి నావా ఏరీతి నిన్ను నిర్మించే తన చేతులు
Verse
నీ లోన తాను నివసింపగోరి దినమెల్ల చే జాచెను‖ 2x ‖
హృదయంబు తలపు తెరువంగ లేవా యేసు ప్రవేశింపను
Verse
తన చేతులందు హృదయంబు ధారల్‌ స్రవియించె నీకోసమే‖ 2x ‖
భరియించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా?
Verse
ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి సమయంభు ఈ నాడేగా‖ 2x ‖
ఈ చోటు నుండి ప్రభు యేసు లేక పోభోకుమా సోదరా

Related Tags

RepentanceSalvationReflection