Verse
నీ జీవితం క్షణ భంగురం
గమ్యంబులేని వేదనల వలయం‖ 2x ‖
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం‖ 2x ‖
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం‖ నీ జీవితం ‖
Verse
ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో‖ 2x ‖
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా‖ 2x నీ జీవితం ‖
Verse
కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా‖ 2x ‖
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా‖ 2x నీ జీవితం ‖