Verse
నీ జీవితం క్షణ భంగురం
నీ యవ్వనం తృణాప్రాయం
ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు
ఎప్పుడు పోవునో నీకు తెలియదు
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరా
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరీ
పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ…
Verse
ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి
విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి‖ 2x ‖
ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో‖ 2x ‖
ఈ క్షణమే తేల్చుకో‖ నీ జీవితం ‖
Verse
నీకున్నవన్నియు క్షణిక సుఖములే
ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును‖ 2x ‖
ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో‖ 2x ‖
ప్రభుని హృదిని చేర్చుకో‖ నీ జీవితం ‖