Verse
నీ జీవితం నీటీ బుడగా వంటిది
ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ‖ 2x ‖
నేడే తెలుసుకో నిజమైన దేవుని
నిత్య జీవముకై వెంబడించు యేసుని‖ నీ జీవితం ‖
Verse
ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము
మనకై మరణించిన ప్రభుని చూడు‖ 2x ‖
ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో‖ 2x ‖
మనదగునూ.. ఆయన క్షమా రక్షణ‖ 2x నీ జీవితం ‖
Verse
ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము
త్వరగా రానైయున్నాడు ప్రభువూ‖ 2x ‖
ఆయనతో పరమునకేగుటకూ‖ 2x ‖
నిరీక్షణ గలవారమైయుందుము‖ 2x నీ జీవితం ‖