Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Jeevitham Viluvainadi

నీ జీవితం విలువైనది

Nee Jeevitham Viluvainadi

Verse
నీ జీవితం విలువైనది
ఏనాడు ఏమరకు
శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం
ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా
ప్రభు యేసు నిన్ను పిలిచెను
నా నేస్తమా తెలిసికో
ప్రభు యేసు నీకై మరణించెను‖ నీ జీవితం ‖
Verse
బలమైన పెను గాలి వీచి
అలలెంతో పైపైకి లేచి‖ 2x ‖
విలువైన నీ జీవిత నావా
తలకిందులై వాలిపోవ
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును‖ నీ జీవితం ‖
Verse
గాఢాంధకారంపు లోయలో
వల గాలి వడి సవ్వడిలో‖ 2x ‖
నడయాడి నీ జీవిత త్రోవా
సుడివడి నీ అడుగు తడబడిన
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును‖ నీ జీవితం ‖
Verse
కనలేని గమ్యంబు కోరి
ఎనలేని కష్టాల పాలై‖ 2x ‖
మనలేని నీ జీవిత గాథా
కలలన్ని కన్నీటి వ్యథలే
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును‖ నీ జీవితం ‖

Related Tags

SalvationEncouragementLife