Verse
నీ జీవమేపాటిది యాకోబు James 4:14
Chorus
నీ జీవితము క్షణభంగురమే - ఒక గడియలోనే గతియించెదవు
Verse
నీటి బుడగవలె నీ జీవితము - సంపూర్ణముగా నశియించు
సాగిపోయెడు నీడవలెనే నీదు బ్రతుకు వున్నదిగా
Verse
ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమును
వ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే - నీవు
Verse
మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములో
నేడే రమ్ము యేసుని కడకు - నీకై రక్తము చిందించెనుగా‖ నిన్ను పిలుచుచున్నాడు ‖