Verse
నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా‖ 2x నీ జీవితములో ‖
Verse
నీ తల్లి గర్భాన నీవుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు‖ 2x ‖
యోచించలేవా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు‖ 2x నీ జీవితములో ‖
Verse
నీలోనే తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను‖ 2x ‖
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను‖ 2x నీ జీవితములో ‖
Verse
తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే‖ 2x ‖
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా‖ 2x నీ జీవితములో ‖
Verse
ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా‖ 2x ‖
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ‖ నీ జీవితములో ‖