Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Jeevithamulo Gamyambuyedo Okasaari Yochinchavaa

నీ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచించవా

Nee Jeevithamulo Gamyambuyedo Okasaari Yochinchavaa

Verse
నీ జీవితములో - గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభుయేసుకొరకు - నీ హృదయమర్పింపవా
Verse
నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు‖ 2x ‖
యోచించినావా ఏ రీతినిన్ను - నిర్మించె తన చేతులు
Verse
నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను
Verse
తన చేతులందు రుధిరంపుధారల్ - స్రవియించె నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా
Verse
ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా
ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా!

Related Tags

GospelRepentanceSalvation