Verse
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా‖ 4x ‖
నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే
నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే
నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే
నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే‖ 2x ‖
Verse
మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్యా
ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా‖ 2x నీవు సెలవియ్యగా ‖
Verse
లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసెదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో‖ 12x ‖
సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా
ఈ క్షణమే యేసయ్యా‖ 8x నీవు సెలవియ్యగా ‖