Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Kanna Nika Vere Velpulu Lera

నీ కన్న నిఁక వేరే వేల్పులు లేర

Nee Kanna Nika Vere Velpulu Lera

Lyricist: Ravuri Lakshminarasayya
Chorus
నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ
కరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగ
నన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద‖ నీ కన్న ‖
Verse
నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపము
లన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యక
యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి‖ నీ కన్న ‖
Verse
వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ బ్రోచితి
తుదిదినంబునఁ గలుగు బాధలుఁ దొలఁగ జేయుట నీవ యని నా
హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక‖ నీ కన్న ‖
Verse
నీ వాక్యార్థము నాలో నివసింపఁ జేసి నీ సేవకునిగఁ బ్రోవవే నీవె
సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకిం కెవరు
లేరు కావవే నను యేసునాయక‖ నీ కన్న ‖

Related Tags

WorshipSalvationJesus