Verse
నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు
నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా‖ 2x ‖
Verse
కన్నవారు నీ దారి నీదన్నారు
నమ్మినవారే నవ్విపోయారు
విరిగి నలిగి నీవైపు చూశాను
తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు‖ యేసయ్యా ‖
Verse
ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు
ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ నా ప్రాణమూ
నీ దయలోనే నా జీవితం‖ యేసయ్యా ‖
Verse
నీ మాటలో నా బాటను
నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ
నీ దరి నేను చేరువరకు‖ యేసయ్యా ‖