Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Kantipaapanu Naa Kantaneeru Choodalevu

నీ కంటిపాపనూ నా కంటనీరు చూడలేవు

Nee Kantipaapanu Naa Kantaneeru Choodalevu

Lyricist: Joshua Shaik
Verse
నీ కంటిపాపనూ – నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో – నేనుందును నీ కృపలో
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా
కన్నవారు నీ దారి నీదన్నారు – నమ్మినవారే నవ్విపోయారు
విరిగి, నలిగీ నీవైపు చూశాను – తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు
ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు – ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ, నా ప్రాణమూ – నీ దయలోనే నా జీవితం
నీ మాటలో నా బాటను – నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు

Related Tags

WorshipDevotionalJesus