Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Kantipaapavale Nannu Kaachutaku

నీ కంటి పాపవలె నన్ను కాచుటకు

Nee Kantipaapavale Nannu Kaachutaku

Lyricist: Joel Kodali
Verse
నీ కంటి పాపవలె నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోరపాపినైన నన్ను మన్నించుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
Verse
వేదనను భరియించి
అవమానం సహియించి
నా కొరకు సిలువలో
ప్రాణమును అర్పించుటకు
నేను అర్హుడనా
Verse
నన్ను పరమున చేర్చుటకు – నీవే నా దరి చేరితివి
నాకు విడుదల నిచ్చుటకు – నా దోషములను మోసితివి
నా శాపము తొలగించుటకు – నీవే పాపముగా మారి
నన్ను శుద్ధుని చేయుటకు – నీ రక్తము చిందించితివి
నాలో ఊపిరి నిలుపుటకు – నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు – నే అర్హుడనా
అల్పుడను నను కరుణించి – రక్షణ కవచము నాకిచ్చి
యోగ్యుడవంటు నను పిలచి – నీ వారసునిగా చేసితివి
అర్పింతును దేవా నీకే – సర్వ ఘనత ప్రభావములు
నా జీవిత పరియంతము – నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకుని – అద్దరి చేరుకుందునయా
నీ మహిమా కాంతులలో – నివసింతునయా

Related Tags

DevotionalGraceSalvation