Verse
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా
నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా
Chorus
నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు
ఎల్లకాలం తోడు నీవే
నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే‖ 2x ‖
కృతజ్ఞతా స్తుతులు నీకే
Verse
పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది
పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది‖ నీ ప్రేమ ‖
Verse
పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది
పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును‖ నీ ప్రేమ ‖