Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Krupa Chaalunayaa

నీ కృప చాలునయా

Nee Krupa Chaalunayaa

Chorus
నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా
నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా
స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును
Verse
నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి
నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి
ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు‖ నీ కృప ‖
Verse
పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు
పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు
నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ‖ నీ కృప ‖
Verse
నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య)
నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద
చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం‖ నీ కృప ‖

Related Tags

PraiseWorshipGrace