Verse
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
Chorus
నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా‖ 2x నీ కృప ‖
Verse
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు‖ 2x ‖
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప‖ 2x యేసయ్యా ‖
Verse
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు‖ 2x ‖
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప‖ 2x యేసయ్యా ‖