Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Krupa Lenicho Oka Kshanamainanu Ne Niluva Jaalano Prabhu

నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభు

Nee Krupa Lenicho Oka Kshanamainanu Ne Niluva Jaalano Prabhu

Verse
నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు‖ 2x ‖
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా‖ 2x నీ కృప ‖
Verse
ఈ ఊపిరి నీదేనయ్యా
నీవిచ్చిన దానం నాకై
నా ఆశ నీవేనయ్యా
నా జీవితమంతా నీకై‖ 2x ‖
నిను నే మరతునా మరువనో ప్రభు
నిను నే విడతునా విడువనో ప్రభు‖ 2x ‖
Verse
నా ఐశ్వర్యమంతా నీవే
ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై
ఉందునా ఈ క్షణమునకై‖ 2x ‖
కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును
నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప‖ 2x నీ కృప ‖

Related Tags

WorshipGrace