Verse
నీ కృప నాకు ఆధారమై
నీ కృప నాకు ఆశ్రయమై
ప్రతీ క్షణమున ప్రతీ స్థలమునా
నన్నెంతో బలపరచెను
Chorus
యేసయ్య నీ కృప చాలయ్యా
నీ కృప చాలును యేసయ్య
Verse
నశియించిపోతున్న నాకోసమే
నరునిగా మారినది నీ కృప
బ్రతికున్న మృతుడను నను లేపగా
మహిమను విడచినది నీ కృప
Verse
యోగ్యతలేని ఈ దీనునిపై
శాశ్వత ప్రేమను చూపినది
బలమైన రక్షణ స్థిరమైన దీవెన
ఇలా నాకు ఇచ్చినది నీ కృప
Verse
పాపాంధకారానా పడియుండగా
నను పిలచినది నీ కృప
పరలోక జీవము నే పొందగా
నను బ్రతికించినది నీ కృప
Verse
విలువగు రుధిరం సిలువలో నాకై
చిందించినది నీ కృప
మితిలేని నీ ప్రేమ గతిలేని నాపైన
విడువక చూపినది నీ కృప