Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Krupa Naaku Chaalunu Nee Krupa Lenide Ne Brathukalenu

నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను

Nee Krupa Naaku Chaalunu Nee Krupa Lenide Ne Brathukalenu

Chorus
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను‖ 2x ‖
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
Verse
జలరాసులన్ని ఏకరాశిగా - నిలిచిపొయెనే నీ జనుల ఎదుట‖ 2x ‖
అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా‖ 2x ‖
నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా‖ 2x ‖
Verse
నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా‖ 2x ‖
నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే‖ 2x ‖
నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా‖ 2x ‖
Verse
జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకొని నన్ను పిలచితివా‖ 2x ‖
నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే‖ 2x ‖
నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను‖ 2x ‖
Chorus
నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా .....
నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా ..... నీ కృపా..... నీ కృపా .....
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను‖ 2x ‖
నీ కృప లేనిదే నే బ్రతుకలేను

Related Tags

FaithGraceGods Help