Verse
నీకృప నేనేమైనా
నీ కృప నాకేమైనా
నీ కృప నీతో ఉన్నా
నీ కృప నేనిల ఉన్నా
ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా‖ 2x ‖
ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా
Chorus
ఆరాధించెదనయ్య
నీ సన్నిధి చేరెదనయ్య‖ 4x ‖
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
Verse
ఎన్నదగిన వాడిని కాను -
మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన
నిన్ను నేను మరిచాను‖ 2x ‖
అయినను నను వీడలేదయ్యా నీ కృపా
చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా‖ 2x ‖
Chorus
ఆరాధించెదనయ్య
నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను‖ 4x ‖
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
Verse
పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను‖ 2x ‖
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప‖ 2x ‖
Chorus
ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య‖ 4x ‖
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
Verse
బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా‖ 2x ‖
అయినా నా చేయి పట్టెను... నీ కృపా
నడిపించి నను గెలిపించినది నీ కృప‖ 2x ‖
Chorus
ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య‖ 4x ‖
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా