Verse
నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా‖ 2x ‖
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము‖ 2x నీ కృప ‖
Verse
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు‖ 2x ‖
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా‖ 2x నీ కృప ‖
Verse
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు‖ 2x ‖
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే‖ 2x నీ కృప ‖
Verse
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు‖ 2x ‖
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా‖ 2x నీ కృప ‖