Verse
నీ కృపను గూర్చి నే పాడెదా
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా‖ 2x ‖
నిత్యము నే పాడెదా
నా ప్రభుని కొనియాడెదా‖ 2x ‖
మహిమా ఘనతా
ప్రభావము చెల్లించెదా‖ 2x నీ కృపను ‖
Verse
ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా
నిందలో అపనిందలో నాకు తోడు నీడగా‖ 2x ‖
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా‖ 2x నీ కృపను ‖
Verse
వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా
మరణమే బాలియాగమై నన్ను విడిపించినా‖ 2x ‖
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా‖ 2x నీ కృపను ‖