Verse
నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా‖ 2x ‖
నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా‖ 2x ‖
మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా.‖ 2x ‖
Verse
ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా‖ 2x ‖
నిందలో అపనిందలో నాకు తోడునీడగా‖ 2x ‖
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా‖ 2x ‖
భయమా దిగులా మనసా నీకేలా‖ 2x ‖
Verse
వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించినా‖ 2x ‖
మరణమై బలియాగమై నన్ను విడిపించినా‖ 2x ‖
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా‖ 2x ‖
భయమా దిగులా మనసా నీకేలా‖ 2x ‖
Verse
మార్గమై నా గమ్యమై నన్ను నడిపించినా‖ 2x ‖
ఓర్పుయై ఓదార్పుయై నన్నాదరించినా‖ 2x ‖
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా‖ 2x ‖
భయమా దిగులా మనసా నీకేలా‖ 2x ‖