Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee krupatho nimpina naa jeevitham

నీ కృపతో నింపిన నా జీవితం…

Nee krupatho nimpina naa jeevitham

Lyricist: Pr William Carey , Esther
Verse 1
నీ కృపతో నింపిన నా జీవితం…..
మహోన్నత సేవకే అంకితం..
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచెను….
సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద…
Verse
ఉన్నత స్థలములలో నన్ను నడిపించే నీదు సంకల్పము….
ఊహకు మించిన కార్యము చేయుటయే నీకే సాధ్యము…
నా మధుర గీతిక నీవేనయ్యా….
నీ మహిమతో నన్ను నింపుమయా….
Verse
పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తము…..
నీతిమంతులమై మొవ్వవేయుదము
నీదు సన్నిధిలో……
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయా….
Verse
అందని శిఖరముపై నన్ను నింపుటకు యాగమైతివి ….
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై…..
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయా

Related Tags

GraceDedicationGods Love