Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Krupaye

నీ కృపయే

Nee Krupaye

Lyricist: Benny Joshua
Verse
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా‖ 2x ‖
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చుంచునది నీ కృప మాత్రమే‖ 2x ‖
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా…‖ 2x ‖
Verse
ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు‖ 2x ‖
బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప‖ 2x ‖
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను‖ నీ కృపయే ‖
Verse
నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు‖ 2x ‖
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప‖ 2x ‖
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను‖ నీ కృపయే ‖

Related Tags

PraiseWorshipGrace