Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Krupaye Naa Jeevithamu

నీ కృపయే నా జీవితము

Nee Krupaye Naa Jeevithamu

Lyricist: Sirisha Grace
Chorus
ఎంత కృప చూపావు - యోగ్యతలేని నాపైన
ఏముంది నీ కృప తప్ప - నా జీవితములో యేసయ్య
నీ కృపయే – నా జీవితము
నీ కృపయే – నాకు ఆధారము
నీ కృపయే నీదు కృపయే - నాకు ఊపిరిని పొసేనయ్యా
నీ కృపయే నీదు కృపయే - నాకు చాలును యేసయ్య
Verse
నా దేహము క్షీణించి ఆఖరి సమయాన - మరణము తప్పించెనే
నీ కృపయే జీవముతో లేపెనే
కదలలేక నా అడుగు నడువలేని సమయాన – నన్ను బలపరిచెనే
నీ కృపయే అడుగులు స్థిరపరిచెనే
ఊపిరి ఉందంటేనే నీ కృపయే
చాలయ్య నా దేవా నీ కృపయే
Verse
నా హృదయము గాయముతో కృంగిన సమయాన – నన్ను ఓదార్చేనే
నీ కృపయే గాయమును మాన్పేనే
ఆశల నా దీపం ఆరిన సమయాన – నన్ను దర్శించేనే
నీ కృపయే నన్ను వెలిగించేనే
నాకున్న నా ధైర్యం నీ కృపయే
చాలయ్యా నా దేవా నీ కృపయే
నాకున్న నాధైర్యం నీ కృపయే
చాలయ్య నా దేవా నీ కృపయే
Verse
పాడలేక నా స్వరము ఆగిన సమయాన –
ఆత్మీయ గీతముతో
నీ కృపయే స్తుతిచేయు కృపనిచ్చెనే
తల్లి గర్భములో రూపింపక మునుపే – నన్ను పిలిచితివే
నీ కృపతో సేవలో నిలిపితివే
చావైనా బ్రతుకైనా నీ సేవనే
నీ కృపతో చేసేదను నా యేసయ్య

Related Tags

ThanksgivingGraceTestimony