Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Maargamu Devaa Bhoomi Meeda Kanabadunatlu

నీ మార్గము దేవా భూమి మీద కనబడునట్లు

Nee Maargamu Devaa Bhoomi Meeda Kanabadunatlu

Verse
నీ మార్గము దేవా భూమి - మీద కనబడునట్లు
నీ రక్షణ అన్యులలో - తెలియబడు గాక
Verse
దేవుడు మమ్ము కరుణించి - దీవించును గాక
ప్రకాశింపజేయుము నీ - ముఖకాంతిని మాపై
Verse
స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
Verse
యెహోవా నీతితో నీవు - న్యాయము తీర్చెదువు
ఏలెదవు భూమిమీద - నున్న జనులను
Verse
జనులానంద యుత్సాహ - ధ్వని చేయుదురు గాక
జనులు దేవా నిన్ను - స్తుతియించెదదు గాక
Verse
భూమి ఫలియించును యెహో - వా మమ్ము దీవించును
భూలోకులందరు దైవ - భక్తి కల్గి యుందురు

Related Tags

WorshipPsalmBlessing