Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Maata Naa Paatagaa Anukshanam Paadanee

నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ

Nee Maata Naa Paatagaa Anukshanam Paadanee

Verse
నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
Verse
ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ
పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ = 2‖ 2x ‖
వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
Verse
నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ
తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ = 2‖ 2x ‖
శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
Verse
ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ
సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ = 2‖ 2x ‖
కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..

Related Tags

WorshipDevotional