Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Mandiramu Atishrungaramu Nee Prajalandariki

నీ మందిరము అతిశృంగారము నీ ప్రజలందరికి

Nee Mandiramu Atishrungaramu Nee Prajalandariki

Chorus
నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికి
మహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ‖ 2x ‖
Verse
నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి‖ 2x ‖
స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి‖ 2x ‖
కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి‖ 2x ‖
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె‖ 2x ‖
Verse
నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదము
అనుదినము స్తుతియించి - నూతన బలమును పొంది
అన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదము
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
Verse
నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతం
శోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచు
అంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదము
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
Verse
కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలన
క్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమను
మునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవ
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె
Verse
అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచి
కట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమను
యుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాక
మహిమ ... మహిమ ... మహిమ ... నీకె

Related Tags

WorshipGloryChurch