Verse
నీ మందిరమునందు - నివసించువారు ధన్యులు, ధన్యులు
నీ ... వలన బలమొందువారు - ధన్యులు ధన్యులు‖ 2x ‖
Verse
యెహోవా, నీయందు - నమ్మికగలవారె ధన్యులు
నీ ధర్మశాస్త్రమునందానందం - గలవారె ధన్యులు‖ 2x ‖
Verse
నీతికొరకు ఆకలి దప్పుల్ - కలిగినవారె ధన్యులు
ఆత్మ విషయంబై దీనులుగా నున్న - వారె ధన్యులు‖ 2x ‖
Verse
హృదయశుద్ధి, కనికరము - కలిగియున్నవారె ధన్యులు
సాత్వీకులు, సమాధానపరచు - వారె ధన్యులు‖ 2x ‖
Verse
క్రీస్తు కొరకు శ్రమనొందుచు - నిందింపబడువారె ధన్యులు
మీ మీద, చెడు మాటలు - పలుకునప్పుడె ధన్యులు‖ 2x ‖
Verse
క్రీస్తు నిమిత్తం, దరిద్రులై - ఆకలిగొనువారె ధన్యులు
సంతోషించి, స్తుతించినచో - పరలోకంలో ధన్యులు‖ 2x ‖
Verse
సత్యం కలిగి వాక్యంచదివి - ధ్యానించేవారే ధన్యులు
వ్రాయబడిన వాక్యంవిన - గైకొనువారె ధన్యులు‖ 2x ‖
Verse
పరలోకంలో చేరుటకు - రక్షణగలవారె ధన్యులు
ప్రభుయేసుక్రీస్తు నందు మృతినొందు - వారందరును ధన్యులు‖ 2x ‖
Verse
చూచి నమ్మువారికంటె - చూడక నమ్మువారె ధన్యులు
ప్రియ సోదర, ప్రియ సోదరి - నిరీక్షణ నుంచుము‖ 2x ‖