Verse
నీ మాటలతో నా బ్రతుకు బ్రతికిస్తావని
ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి
ఇది నా చివరి ఇది నా కడవరి
మిగిలియున్న నిరీక్షణా. . మిగిలియున్న నిరీక్షణా. .
Verse
పాపపు ఊబిలో పాతుకుపోయిన
పాపపు తీగెలో అల్లుకుపోయిన‖ 2x ‖
పాత రోత జీవితాన్ని‖ 2x ‖
పవిత్ర పరచుము పరిశుద్ధుడా
పవిత్ర పరచుము పరమాత్ముడా
Verse
చితికిన బ్రతుకు చీదరి తనువు
చిక్కులలోనా చిక్కిన నన్ను‖ 2x ‖
చేరదీసి సేదదీర్చుము‖ 2x ‖
చేతనైన పరిశుద్ధుడా
చేతనైనా పరమాత్ముడా