Chorus
నీ మేలులు వివరింపతరమా
నీ మేలులు వివరింపతరమా ప్రభువా
నీ కృపలను నే మరువగలనా
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో
Verse
శోధనలే నన్ను వెన్నంటిఉన్నా
బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా
నను ధైర్యపరచి నడిపించినావే
నా హృదయవేధన తొలగించినావే‖ ఆదరించావు ‖
Verse
ఊహించలేని కార్యాలు ఎన్నో
లెక్కించలేని పర్యాయములలో
నా జీవితంలో జరిగించినావే
నీ క్రుపతో నిత్యము దీవించినావే‖ ఆదరించావు ‖
Verse
మరచిపోలేని నీ మేలులెన్నో
దయచేసినావు నా జీవితములో
నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో
నీ కరుణకు బదులు ఏముంది ధరలో‖ ఆదరించావు ‖