Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Naamam Athi Madhuram

నీ నామం అతి మధురం

Nee Naamam Athi Madhuram

Lyricist: Kranthi Chepuri
Verse
నీ నామం అతి మధురం
నీ గానం నే చేసెదను‖ 2x ‖
నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము
ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము‖ 2x ‖
మహోన్నతమైనది యేసు నీ నామము
కీర్తింపతగినది సాటిలేని నీ నామం‖ నీ నామం ‖
Verse
ఆదరించే నామం – ఆశ్రయంబగు నామం
ఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం‖ 2x ‖
అన్ని నామములకు పైన నామం
ఉన్నతంబగు నీ నామం‖ నీ నామం ‖
Verse
జాలి గలిగిన నామం – జాగు చేయని నామం
జవాబు నొసగే నామం – జయమునిచ్చే నామం‖ 2x ‖
జుంటె తేనె కన్న మధురం
జీవ జలమగు నీ నామం‖ నీ నామం ‖

Related Tags

PraiseWorshipJesus