Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Naamame Eda Kolichedanu

నీ నామమే ఎద కొలిచెదను

Nee Naamame Eda Kolichedanu

Verse
నీ నామమే ఎద కొలిచెదను
నీ వాక్యమునే సదా తలచెదను‖ 2x ‖
సైన్యములకధిపతియగు దేవా
ఆది దేవుడవయిన యెహోవా‖ 2x నీ నామమే ‖
Verse
దోష రహితుడ – సృష్టి కారుడ
నేరమెంచని నిర్ణయకుడా
సిలువ దరుడ – మరణ విజయుడ
లోక రక్షక యేసు నాథుడా‖ 2x సైన్యము ‖
Verse
నిన్ను మరచిన – మిగులు శూన్యము
నీతో అణకువ పెంచు జ్ఞానము
నాదు లోకము – బహు కలవరము
నీదు వాక్యము తెలుపు మార్గము‖ 2x సైన్యము ‖
Verse
క్షణము వీడని – నీడ నీవని
నమ్మి నిరతము నిన్ను వేడెద
నీదు పాత్రగ – యాత్ర సాగెద
నీదు ఘనతను ఎలిగి చాటెద‖ 2x సైన్యము ‖

Related Tags

WorshipDevotionalPrayer