Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Naamamune Koniyadedanu Nee Sannidhilo

నీ నామమునే కొనియాడెదను నీ సన్నిధిలో

Nee Naamamune Koniyadedanu Nee Sannidhilo

Verse
నీ నామమునే కొనియాడెదను నీ సన్నిధిలో నే పాడెదను
నీవే నా జీవము నీవే నా స్వాస్ధ్యము నీ నామమునే . . ఆ . .
Verse
నా కోసమే ఈ భువికొచ్చి నీ ప్రాణమే అర్పించి నీ రక్షణే నొసగితివే
నీ మహిమను విడచి వచ్చి నీ మార్గము నాకందించి నీ కృపను చూపించితివే
ఏలాగు వర్ణింతునయ్యా యేసయ్యా నీ గొప్ప త్యాగంబును
ఏలాగు వర్ణింతునయ్యా యేసయ్యా నీ అనురాగంబును
Verse
ఆత్మ స్వరూపుడా ఆది సంభూతుడా నీ ఆత్మ బలమును కుమ్మరించుమయ్యా
నీతి స్వరూపుడా నరరూపధారుడా పునరుత్ధాన శక్తితో ఉజ్జీవింపుమయ్యా
నీదు సేవలో నేను సాగెదన్ యేసయ్యా
నీదు ప్రేమను నీదు మహిమను నీదు నామమును నేను చాటెదను

Related Tags

PraiseWorshipJesus