Verse
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
అది నిర్దేశించును జీవిత గమ్యమును
ఈనాడే యేసుని చెంతకు చేరు‖ 2x నీ నిర్ణయం ‖
Verse
లోకం దాని ఆశలు గతించిపోవును
మన్నైన నీ దేహం మరల మన్నై పోవును‖ 2x ‖
మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
క్షయమైన నీ దేహం అక్షయముగా మారును‖ 2x నీ నిర్ణయం ‖
Verse
పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
శాపంతో నీవుండిన తప్పదు మరణము‖ 2x ‖
భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో‖ 2x నీ నిర్ణయం ‖