Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Paada Sannidhiki Krupaamaya Yesayya

నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా

Nee Paada Sannidhiki Krupaamaya Yesayya

Chorus
నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని
Verse
విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను
Verse
ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో
దయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా
Verse
నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను
Verse
నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము
Verse
ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడ
సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ
Verse
శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము
Verse
జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము
ఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము
Verse
సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా
కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను

Related Tags

WorshipGracePrayer