Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Paadaalu Tadapakunda Naa Payanam Saagadayyaa

నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా

Nee Paadaalu Tadapakunda Naa Payanam Saagadayyaa

Lyricist: Finny Abraham
Verse
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం‖ 2x ‖
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా‖ 2x ‖
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా‖ 2x ప్రార్థన ‖
Verse
ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము‖ 2x ‖
ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము‖ 2x ‖
ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము‖ 2x ప్రభువా ‖
Verse
ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము‖ 2x ‖
ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము‖ 2x ‖
ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము‖ 2x ప్రభువా ‖

Related Tags

FaithDevotionalPrayer